దోమకాటుకు కూడా బీమా..ప్రీమియం ఎంతంటే?

|

Sep 27, 2019 | 10:03 PM

వర్షాకాలం వచ్చిందంటే దోమల విజృంభణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు దోమల వల్ల సంక్రమిస్తాయి. హైదరబాద్‌లో  ఈ ఏడాది డెంగ్యూ ఎంత వీరవిహారం చేసిందే అందరికి తెలిసిందే. హాస్పటల్‌కి వెళ్తే వేలకు, వేలు బిల్లులతో ప్రజలు తెగ ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ప్రజల జేబుకు చిల్లు పడకుండా.. ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్​లు సంయుక్తంగా ఓ వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చాయి. దోమకాటు వల్ల సంక్రమించే […]

దోమకాటుకు కూడా బీమా..ప్రీమియం ఎంతంటే?
Follow us on

వర్షాకాలం వచ్చిందంటే దోమల విజృంభణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు దోమల వల్ల సంక్రమిస్తాయి. హైదరబాద్‌లో  ఈ ఏడాది డెంగ్యూ ఎంత వీరవిహారం చేసిందే అందరికి తెలిసిందే. హాస్పటల్‌కి వెళ్తే వేలకు, వేలు బిల్లులతో ప్రజలు తెగ ఇబ్బందిపడ్డారు.

ఇప్పుడు ప్రజల జేబుకు చిల్లు పడకుండా.. ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్​లు సంయుక్తంగా ఓ వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చాయి. దోమకాటు వల్ల సంక్రమించే ఏడు రకాల వ్యాధులకు పరిహారం అందించేందుకు ఈ సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీ దోహదపడనుంది.

దేశంలో బీమా పరిధిని పెంచడంలో భాగంగా ‘మస్కిటో డిసీస్​ ప్రొటెక్షన్​ పాలసీ’ (ఎండీపీపీ)ని తీసుకొచ్చినట్లు ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకును ఉపయోగిస్తున్నవారు ఏడాదికి రూ.99 ప్రీమియం చెల్లించి ఈ పాలసీ తీసుకోవచ్చని తెలిపింది. దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, చికెన్​ గున్యా, బోదకాలు, మెదడువ్యాపు వ్యాధి, జికా వైరస్​ లాంటి వ్యాధులు ఈ పాలసీ కిందకు వస్తాయి. రోగం బారినపడి 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంటే, ఈ పాలసీలో పేర్కొన్న మొత్తం విలువ… గరిష్ఠంగా రూ.10,000 వరకూ పరిహారంగా అందుతుంది. ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా ఈ బీమాను సులువుగా తీసుకునే వీలుందని ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్​ ఎండీ, సీఈఓ అనుబత్రా విశ్వాస్​​ పేర్కొన్నారు.