ఏడాదిలో వాయుకాలుష్యంతో భారత్‌లో 17 లక్షల మంది మృతి.. సైంటిఫిక్ మ్యాగజైన్ నివేదికలో వెల్లడి

|

Dec 22, 2020 | 8:52 PM

గడిచిన ఏడాదిలో వాయుకాలుష్యం కారణంగా భారత్‌లో ఏకంగా 17 లక్షల మంది మృతి చెందారని సైంటిఫిక్‌ మ్యాగజైన్‌ లాన్సెట్‌ తన నివేదికలో వెల్లడించింది. ఇది దేశంలోని మొత్తం మరణాల్లో 18 శాతం కావడం ఆందోళన కలిగించే అంశం.

ఏడాదిలో వాయుకాలుష్యంతో భారత్‌లో 17 లక్షల మంది మృతి.. సైంటిఫిక్ మ్యాగజైన్ నివేదికలో వెల్లడి
Follow us on

Air pollution show bad effects: గడిచిన ఏడాదిలో వాయుకాలుష్యం కారణంగా భారత్‌లో ఏకంగా 17 లక్షల మంది మృతి చెందారని సైంటిఫిక్‌ మ్యాగజైన్‌ లాన్సెట్‌ తన నివేదికలో వెల్లడించింది. ఇది దేశంలోని మొత్తం మరణాల్లో 18 శాతం కావడం ఆందోళన కలిగించే అంశం. సైంటిఫిక్ మ్యాగజైన్ ఈ నివేదికను ఆర్థిక, ఆరోగ్య రంగాలపై కాలుష్యం అనే అంశంపై రూపొందించింది. ఇళ్లలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని కానీ.. బయటి వాయు కాలుష్యం మాత్రం ఏకంగా 115 శాతం పెరిగిందని తేలింది.
ఇక వాయు కాలుష్యం కారణంగా దేశ జీడీపీకి 1.4 శాతం నష్టం వాటిల్లిందని లాన్సెట్ తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు, మధుమేహం వ్యాధుల మరణాలతో పాటు నవజాత శిశువుల మరణాలు సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. ఇక వాయు కాలుష్యం కారణంగా మనుషుల ఆరోగ్యాలపైనే కాకుండా ఆర్థిక రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన వాయు కాలుష్యం ఆరోగ్యాలతో పాటు భారత ఉత్పాదకతను దెబ్బతీస్తుందని అంటున్నారు.