ఎయిర్ ఇండియా స‌ర్వీసుల పున‌రుద్ధరణ

| Edited By:

Apr 27, 2019 | 11:52 AM

ఎయిర్ ఇండియా విమానాల సర్వీసులు మళ్లీ  మొదలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున ఆ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఐటీఏ సాప్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల శనివారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 8.45 గంటల వరకు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగిందని ఆ సంస్థ సీఎండీ అశ్వనీ లోహాని తెలిపారు. అనంతరం ఎయిర్ ఇండియా సాంకేతిక నిపుణుల బృందం డౌన్ అయిన […]

ఎయిర్ ఇండియా స‌ర్వీసుల పున‌రుద్ధరణ
Follow us on

ఎయిర్ ఇండియా విమానాల సర్వీసులు మళ్లీ  మొదలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున ఆ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఐటీఏ సాప్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల శనివారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 8.45 గంటల వరకు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగిందని ఆ సంస్థ సీఎండీ అశ్వనీ లోహాని తెలిపారు. అనంతరం ఎయిర్ ఇండియా సాంకేతిక నిపుణుల బృందం డౌన్ అయిన సర్వర్ ను పునరుద్ధరించిందని తెలిపారు. సర్వర్ డౌన్ వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. మొత్తంమీద ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్ ప్రభావం ఈ రోజు సాయంత్రం వరకు విమానాల రాకపోకలపై ప్రభావం చూపించనుంది.