కరోనా ఎఫెక్ట్: ఎయిర్ ఇండియాలో 48 మంది పైలెట్ల తొలగింపు..!

| Edited By:

Aug 15, 2020 | 10:57 AM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ

కరోనా ఎఫెక్ట్: ఎయిర్ ఇండియాలో 48 మంది పైలెట్ల తొలగింపు..!
Follow us on

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. కరోనా సంక్షోభం వల్ల నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలగింపునకు గురైన 48 మంది పైలెట్లు గత ఏడాది రాజీనామా చేస్తూ 6 నెలల నోటీసు ఇచ్చిన తర్వాత, వారు దాన్ని ఉపసంహరించుకున్నారు.

‘కరోనా ప్రభావంతో కంపెనీ భారీ నికర నష్టాలను చవిచూస్తోంది. ప్రస్తుత కాలంలో జీతాలు చెల్లించే ఆర్థిక సామర్థ్యం లేదు.’ అని సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన టెర్మినేషన్ లెటర్ లో పేర్కొంది. ఎయిర్ బస్ విమానాలు నడుపుతున్న పైలెట్లను తొలగించింది. పైలెట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిపిఎ), ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ ను కోరింది.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!