అక్కడ అలా వేస్తే.. మీ జేబుకు చిల్లే…

| Edited By:

May 09, 2019 | 1:45 PM

స్వచ్ఛ సర్వేక్షణ్ ‌2019 కార్యక్రమంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, చెత్తా చెదారం పారవేసినా జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఇలా చేసే వారికి సీసీటీవీ నిఘా ద్వార జరిమానాలు విధిస్తామని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా సీసీటీవీ నిఘాతో కూడిన కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేయించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నగర పోలీసులతో కలిసి మున్సిపల్ […]

అక్కడ అలా వేస్తే.. మీ జేబుకు చిల్లే...
Follow us on

స్వచ్ఛ సర్వేక్షణ్ ‌2019 కార్యక్రమంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, చెత్తా చెదారం పారవేసినా జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఇలా చేసే వారికి సీసీటీవీ నిఘా ద్వార జరిమానాలు విధిస్తామని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా సీసీటీవీ నిఘాతో కూడిన కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేయించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నగర పోలీసులతో కలిసి మున్సిపల్ ఉద్యోగులు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి ఈ-రిక్షాలు అందజేశారు. ఈ బృందాలు పారిశుద్ధ్యం గురించి ప్రజల్లో చైతన్య తీసుకువచ్చేందుకు ప్రచారం చేయడంతోపాటు ఉమ్మి వేసిన, చెత్తాచెదారం పడేసిన వారి నుంచి జరిమానాలు కూడా వసూలు చేస్తాయని కమిషనర్ వివరించారు.