Agri Gold Scam : అగ్రిగోల్డ్ కేసులో ఈడీ విచారణ.. నేడు ఈడీ కస్టడికి అగ్రిగోల్డ్ స్కాం నిందితులు

|

Dec 28, 2020 | 9:09 AM

అగ్రిగోల్డ్ స్కాం నిందితులను ఇవాళ ఈడీ కస్టడీకి తరలించనున్నారు. ఈడీ కోర్టు నిందితులను పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. జనవరి 5 వరకూ నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ కోర్టు అనుమతివ్వనుంది. అగ్రిగోల్డ్ ఛైర్మన్..

Agri Gold Scam : అగ్రిగోల్డ్ కేసులో ఈడీ విచారణ.. నేడు ఈడీ కస్టడికి అగ్రిగోల్డ్ స్కాం నిందితులు
Follow us on

Agri Gold Scam : అగ్రిగోల్డ్ స్కాం నిందితులను ఇవాళ ఈడీ కస్టడీకి తరలించనున్నారు. ఈడీ కోర్టు నిందితులను పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. జనవరి 5 వరకూ నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ కోర్టు అనుమతివ్వనుంది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, వైస్ చైర్మన్ ఏవీ శేషు నారాయణ రావు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ సుందర వరప్రసాద్‌ను చంచల్ గూడా జైలు నుండి ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు.  నిందితులను జైల్ నుంచి ఈడీ కార్యాలయానికి అధికారులు తరలించనున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది.

రూ.4,109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.942.96 కోట్ల సొమ్మును ఇతర కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు. 7 రాష్ట్రాల్లో 32 లక్షల డిపాజిట్ల ద్వారా రూ.6,380 కోట్లను అగ్రిగోల్డ్ సేకరించింది. మనీలాండరింగ్‌పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.