విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్.. పరీక్షలు లేకుండా ప్రమోట్

| Edited By:

Jun 01, 2020 | 5:22 PM

కోవిద్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఫలితంగా దేశంలోని అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పట్లో పరీక్షలు నిర్వహించడం

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్.. పరీక్షలు లేకుండా ప్రమోట్
Follow us on

కోవిద్-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఫలితంగా దేశంలోని అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పట్లో పరీక్షలు నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తోంది. తాజాగా.. యూనివర్సిటీల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించమని, వారికి గత సంవత్సరపు ఫలితాల ఆధారంగా అవార్డ్ మార్కులు వేస్తాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

కాగా.. మహారాష్ట్రలో ఉన్న కాలేజీలు, యూనివర్సీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు వెంటవెంటనే నిర్వహించడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం అని, అందుకు అనుమతులు కష్టమే అని తన సోషల్ మీడియాలో సీఎం తెలిపారు. మే 30న యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో సమావేశంలో ఉద్ధవ్ థాకరే ఈ విషయాన్ని ప్రస్తావించగా వైస్ ఛాన్సలర్లు ఏకగ్రీవంగా అంగీకరించారు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలకు రావడం చాలా ప్రమాదకరమని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు.

[svt-event date=”01/06/2020,5:14PM” class=”svt-cd-green” ]