కరోనా ఎఫెక్ట్: స్విగ్గీలో 1100 మందిపై వేటు..

| Edited By:

May 18, 2020 | 3:38 PM

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థ‌లు ఉద్యోగుల్ని తొల‌గిస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్: స్విగ్గీలో 1100 మందిపై వేటు..
Follow us on

Swiggy: కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థ‌లు ఉద్యోగుల్ని తొల‌గిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివ‌రీ సంస్థ స్విగ్గీ కూడా ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుమారు 1100 మంది ఉద్యోగులను కొన్ని రోజుల పాటు దూరంగా పెట్ట‌నున్న‌ట్లు పేర్కొంది.

స్విగ్గీ సోమవారం ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఉద్యోగులను తాత్కాలికంగా దూరంగా పెట్ట‌నున్న‌ట్లు పేర్కొంది. స్విగ్గీలో ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం ప‌ట్ల సీఈవో శ్రీహ‌ర్ష స్పందించారు. స్విగ్గీకి ఇది చీక‌టి రోజు అన్నారు. రానున్న కొన్ని రోజుల్లో వివిధ హోదాల్లో ఉన్న 1100 మందిని తొల‌గించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వారం క్రిత‌మే జొమాటో కూడా 13 శాతం మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది. మిగితా ఉద్యోగుల‌పై సుమారు 50 శాతం జీతం కోత విధించింది.

Also Read: బ్రేకింగ్: లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించిన ఏపీ..