జీతాలివ్వలేం.. చేతులెత్తేసిన మరో ఎయిర్ లైన్స్

| Edited By:

Apr 29, 2019 | 4:48 PM

ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయి మూతపడగా, వాటి దారిలోనే మరో సంస్థ కూడా నడుస్తోంది. భారత్‌లో చాపర్, ప్రైవేట్ జెట్, పర్సనల్ జెట్ సేవలందిస్తున్న పవన్ హాన్స్, తమ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 89 కోట్ల నికర నష్టం నమోదైన కారణంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని, అందువల్ల వేతనాలు ఇవ్వలేమని చెబుతూ ఉద్యోగులకు ఓ సర్క్యులర్ […]

జీతాలివ్వలేం.. చేతులెత్తేసిన మరో ఎయిర్ లైన్స్
Follow us on

ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయి మూతపడగా, వాటి దారిలోనే మరో సంస్థ కూడా నడుస్తోంది. భారత్‌లో చాపర్, ప్రైవేట్ జెట్, పర్సనల్ జెట్ సేవలందిస్తున్న పవన్ హాన్స్, తమ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 89 కోట్ల నికర నష్టం నమోదైన కారణంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని, అందువల్ల వేతనాలు ఇవ్వలేమని చెబుతూ ఉద్యోగులకు ఓ సర్క్యులర్ పంపింది. ఇండియాలో పౌరవిమానయాన రంగం అభివృద్ధికి అవకాశాలు సానుకూలంగా లేవని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.

కాగా, నికర నష్టం వచ్చిందన్న కారణంతో వేతనాలు ఇవ్వలేమని చెప్పడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మా పట్ల అమానుషంగా సంస్థ ప్రవర్తిస్తోందని, వేతనాల సవరణ జరుగుతుందని వేచి చూస్తున్న తమకు, అసలు వేతనమే ఇవ్వమని చెప్పడం తగదని వ్యాఖ్యానించారు. కాగా, ఏప్రిల్ వేతనాలు అందని ఉద్యోగుల సంఖ్య స్వల్పమేనని, వారికి మాత్రమే సర్క్యులర్ పంపామని పవన్ హాన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.