కేసీఆర్ నయా ప్లాన్.. తెర మీదకు ట్రబుల్ షూటర్!

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కారు జోరు తగ్గడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో ఆయన సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వారు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సంగతి […]

కేసీఆర్ నయా ప్లాన్.. తెర మీదకు ట్రబుల్ షూటర్!

Updated on: May 25, 2019 | 7:51 AM

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కారు జోరు తగ్గడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో ఆయన సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వారు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో హరీష్ రావుకు మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అని అనుకున్నా.. టీఆర్ఎస్ అభిమానులకు నిరాశే మిగిలింది. కొద్దినెలలుగా జరుగుతున్న స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యాడు.

కాగా హరీష్ రావు అయిదు నెలలుగా పార్టీకి దూరంగా ఉండడంతో ఆయనపై పలు ప్రచారాలు కూడా జరిగాయి. దీనికి స్వయంగా ఆయనే వివరణ కూడా ఇచ్చారు. ఇకపోతే రీసెంట్‌గా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి. మొత్తానికి 17 స్థానాల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ అనుకుంటే .. సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. 17 సీట్లలో కేవలం 9 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అందులోనూ కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత దారుణ పరాజయం.. గులాబీ పార్టీ వర్గాల్లో గెలుపు సంతోషాన్ని లేకుండా చేశాయి. కవిత ఓటమి ఒక పక్క అయితే.. కంచుకోట లాంటి కరీంనగర్ స్థానంలోనూ ఓటమి చెందడం వారికీ మింగుడుపడని రీతిలో మారింది.

మరోవైపు హరీష్ రావు పర్యవేక్షించిన మెదక్ ఎంపీ స్థానంలో పార్టీ విజయం సాధించటమే కాదు.. ఏకంగా రెండున్నర లక్షల మెజార్టీ రావటంతో గెలుపు క్రెడిట్ మొత్తం హరీశ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి తరుణంలో.. ఇప్పటివరకూ పక్కన పెట్టిన హరీష్ రావుకు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం సంతరించుకుంది. తాజా వైఫల్యంతో కేసీఆర్ తన ఫ్యూచర్ ప్లాన్‌ను ఏవిధంగా అమలు చేస్తారో చూడాలి.