Akshay Kumar Ramasethu movie : ప్రొడ్యూసర్ కు దర్శకుడికి మధ్య గొడవ.. డైలమాలో సినిమా..

అక్షయ్ కుమార్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకు పోతున్నాడు.. ఈ క్రమంలోనే అక్షయ్ తో `రామ సేతు` పేరుతో భారీ పాన్ ఇండియా

Akshay Kumar Ramasethu movie : ప్రొడ్యూసర్ కు దర్శకుడికి మధ్య గొడవ.. డైలమాలో సినిమా..

Updated on: Jan 05, 2021 | 2:02 PM

Ramasethu movie : అక్షయ్ కుమార్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకు పోతున్నాడు.. ఈ క్రమంలోనే అక్షయ్ తో `రామ సేతు` పేరుతో భారీ పాన్ ఇండియా మూవీని ప్రకటించింది యష్ రాజ్ సంస్థ. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయేలా కనిపిస్తుంది. అందుకు కారణం..యష్ రాజ్ సంస్థ అధినేత ఆదిత్యా చోప్రాతో దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది మధ్య చెడిందట. దాంతో ఈ సినిమా ఆగిపోబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తన సహచరులతో ఎంతో విధేయుడిగా ఉండే ఆదిత్య చోప్రా చంద్ర ప్రకాష్ తో మాత్రం సరిగా ఉండటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సంస్థలో ‘పృథ్వీరాజ్’ చిత్రానికి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. కానీ అతడికి రిలీజ్ ప్రమోషన్స్ లో ప్రాధాన్యతనివ్వడం లేదని టాక్ వినిపిస్తుంది. దానికి కారణం ఆదిత్య చోప్రాకు చెప్పకుండా ద్వివేది రామ సేతు స్క్రిప్ట్ ను అక్షయ్ కుమార్ తో చర్చించారు. దాంతో పాటే  ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దాంతో ఆదిత్య చోప్రా హార్ట్ అయ్యారని తెలుస్తుంది. దాంతో ఈ సినిమాను పక్కన పెట్టె ఆలోచనలో ఆదిత్య ఉన్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

accident in nandigama : ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనమే అతడిపాలిట మృత్యుపాశం అయ్యింది…

Prabhas Wishes Deepika: దీపికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డార్లింగ్‌.. ‘అందమైన సూపర్‌ స్టార్‌’ అంటూ..