Car Insurance Add On: కారు కొన్నారా? ఇన్సూరెన్స్ చేయించారా? యాడ్-ఆన్స్ తీసుకోలేదు కదూ.. అవి చాలా ముఖ్యం ఎందుకంటే..

|

Oct 09, 2021 | 1:58 PM

కారు కొనుగోలు చేసేటప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి.. తప్పనిసరిగా అందరూ ఇన్స్యూరెన్స్ తీసుకుని తీరతారు.

Car Insurance Add On: కారు కొన్నారా? ఇన్సూరెన్స్ చేయించారా? యాడ్-ఆన్స్ తీసుకోలేదు కదూ.. అవి చాలా ముఖ్యం ఎందుకంటే..
Car Insurance Ad Ons
Follow us on

Car Insurance Add On: కారు కొనుగోలు చేసేటప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి.. తప్పనిసరిగా అందరూ ఇన్స్యూరెన్స్ తీసుకుని తీరతారు. అయితే, ఇన్సూరెన్స్ తో పాటు కొన్ని యాడ్ ఆన్స్ తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. కానీ, ఆ యాడ్ ఆన్స్ తీసుకోవడం మర్చిపోతున్నారు లేదా తేలికగా తీసుకుంటారు అందరూ. అయితే, నిపుణులు కారు ఇన్సూర్ చేయించినపుడు కచ్చితంగా యాడ్ ఆన్స్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. దీనివల్ల పాలసీదారులకు ప్రమాదం, వాహనం దెబ్బతిన్న సందర్భంలో పూర్తి క్లెయిమ్ పొందలేమని అన్నారు. మోటార్ బీమాకు ఈ యాడ్-ఆన్‌లు వాహన యజమానులను ఒత్తిడికి దూరం చేస్తాయి. ఇప్పుడు ఆ యాడ్ ఆన్ లు ఏమి ఉంటాయో.. నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.

వాహన భర్తీ యాడ్-ఆన్

కారు పూర్తిగా ధ్వంసం అయితే ఈ యాడ్-ఆన్ ఉపయోగపడుతుంది. ఈ మేక్, మోడల్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లలో ఒకే విధమైన లేదా దానికి సమానమైన వాహనాలను పొందవచ్చు. ఈ కవర్ కారు దొంగతనం లేదా దెబ్బతిన్న సందర్భంలో కారు ఇన్‌వాయిస్ విలువను క్లెయిమ్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిలో, కారు ఆన్-రోడ్ ధర చెల్లిస్తారు.

ఇంజిన్ ప్రొటెక్షన్

ఈ యాడ్-ఆన్ కారు ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించడం, గేర్‌బాక్స్‌కు నష్టం, హైడ్రోస్టాటిక్ లాక్‌కి నష్టం వంటి సంఘటనల నుండి రక్షిస్తుంది. ఇంజిన్‌ను రీప్లేస్ చేయడానికి లేదా రిపేర్ చేయడానికి, సిలిండర్ హెడ్, పిస్టన్, క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్ వంటి దాని భాగాలను క్లెయిమ్ చేయడానికి ఇది అనుమతిస్తుంది.

వినియోగించదగిన కవర్

కారు యొక్క లూబ్రికెంట్స్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, నట్స్ అండ్ బోల్ట్స్, ఆయిల్ ఫిల్టర్ వంటి వినియోగించదగిన భాగాలు మోటార్ బీమా పాలసీ కింద మినహాయించబడ్డాయి. యాక్సిడెంట్ క్లెయిమ్ సమయంలో, ఈ భాగాలను మార్చడానికి అయ్యే ఖర్చు వాహన యజమానులే భరిస్తారు. వినియోగించదగిన కవర్ అటువంటి నష్టాల నుండి రక్షిస్తుంది.

వాహన యజమానుదారులకు ఈ యాడ్ ఆన్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి కారు కొన్న వెంటనే చేయించే ఇన్సూరెన్స్ తో పాటు ఈ యాడ్ ఆన్స్ కూడా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Huzurabad – Badvel: తెలంగాణ హుజురాబాద్‌.. ఆంధ్ర బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో నమోదైన నామినేషన్ల చిట్టా ఇదీ.