
అటు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే.. ఇటు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది.

ఇటీవల 'ది ఫ్యామిలి మెన్ 2' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాలో ప్రియమణి నటన చూసిన దర్శకనిర్మాతలు ఆమెకు వరుస ఆఫర్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ప్రియమణి తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమాలో.. రానా మూవీ 'విరాటపర్వం' మూవీలో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత థియేటర్లలోకి రానున్నాయి.

ఈ క్రమంలోనే ప్రియమణి మాట్లాడుతూ.. నేను చేసిన రెండు పాత్రలు చాలా భిన్నమైనవి.. తెలుగులో నా కెరీర్ మళ్లీ ఊపందుకునేలా చేసేవే..

"నరసింహ" సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి తరహా పాత్రలో నటించాలని ఉంది.

పొగరు.. పంతంతో కూడిన అలాంటి పాత్రలు నా బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అవుతాయి. అలాంటి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకోచ్చింది.