‘నాకిది తగిన గుణపాఠం’ – మంచు లక్ష్మి ఆక్రోశం

|

Oct 08, 2020 | 8:04 AM

బాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మి ఆక్రోశం వ్యక్తం చేశారు. సాటి మహిళగా రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ‘మా నోళ్లు కట్టేస్తున్నారు.. మరి… సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీల నుంచి సమాచారాన్ని లీక్‌ చేస్తున్నదెవరు? మాకు పెట్టే ఆంక్షలు మీడియాకు వర్తించవా?’ అని ఆమె వ్యవస్థను నిలదీసే ప్రయత్నం చేసింది. తనపై సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు చూసి మా అమ్మ కూడా టెన్షన్‌ పడుతోందని.. రియాకు మద్దతు తెలపడం… […]

నాకిది తగిన గుణపాఠం - మంచు లక్ష్మి ఆక్రోశం
Follow us on

బాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మి ఆక్రోశం వ్యక్తం చేశారు. సాటి మహిళగా రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ‘మా నోళ్లు కట్టేస్తున్నారు.. మరి… సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీల నుంచి సమాచారాన్ని లీక్‌ చేస్తున్నదెవరు? మాకు పెట్టే ఆంక్షలు మీడియాకు వర్తించవా?’ అని ఆమె వ్యవస్థను నిలదీసే ప్రయత్నం చేసింది. తనపై సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు చూసి మా అమ్మ కూడా టెన్షన్‌ పడుతోందని.. రియాకు మద్దతు తెలపడం… నాకు గుణపాఠం నేర్పిందని లక్ష్మి వాపోయింది.

ఇకపై అభిప్రాయాలను ఓపెన్‌గా వెల్లడించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది. రియాకు మద్దతుగా ట్వీట్‌ చేసినప్పుడు వేలాది కాల్స్ వచ్చాయి.. నన్ను కూడా తీసుకువచ్చి రచ్చ చేయాలని చూశారు. కోవిడ్‌లో మనమే నెంబర్‌ వన్‌, మన ఎకానమీ కొలాప్స్ అయ్యింది. వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? అని మంచు లక్ష్మి ఒక రేంజ్ లో ఫైరయ్యారు.