మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం నిన్న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగబాబు ఓ ట్వీట్ చేశారు. అందులో ”డియర్ చై.. దాదాపు అన్ని విషయాల్లోనూ తను అచ్చం నాలాగే ఉంటుందని అంతా అంటూంటారు. తనపై ఈ ప్రపంచంలోని ప్రేమనంతా నువ్వు కురిపిస్తావని నమ్ముతున్నా”.. అంటూ తనకు కాబోయే అల్లుడు చైతన్యను ఉద్దేశించి నాగబాబు ఆత్మీయ ట్వీట్ చేశారు. అలాగే ”ఈ రోజు నుంచి తను నీ సమస్యగా మారిపోయిందంటూ’ చమత్కరించారు నాగబాబు.
Daughters are like our reflection in water. The more you try to hold it the more ripples you create. so just let them be themselves and cherish every moment wondering how they grow up to be you. love you NIHA.@IamNiharikaK pic.twitter.com/isdS7uAXLb
— Naga Babu Konidela (@NagaBabuOffl) August 14, 2020
ఇక సినీ హీరో, నిహారిక తోబుట్టువు వరుణ్ తేజ్ కూడా నిహారిక, చైతన్యల గురించి ట్వీట్ చేశారు. ”నా బేబీ సిస్టర్ ఎంగేజ్ మెంట్ ఈ రోజు జరిగింది. మా కుటుంబంలోకి స్వాగతం బావా”.. అంటూ నిహారిక, చైతన్యలో ఫొటో పెట్టి ట్వీట్ చేశాడు వరుణ్.
And this happened!!
My baby sis gets engaged!
Welcome to the family bava
@niharikakonidela
❤️❤️❤️ pic.twitter.com/YwJhfSTNhB— Varun Tej Konidela ? (@IAmVarunTej) August 13, 2020
కాగా నాగబాబు డాటర్ నిహారిక, గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఇందులో పాల్గొని సందడి చేశారు.