జగన్‌కు మా మద్దతు తప్పక ఉంటుంది..!

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, జనసేన నేత, ప్రముఖ నటుడు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీకి మంచి సుపరిపాలన అందించే విషయంలో తమ సహకారం ఎప్పుడూ జగన్‌కు ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. జనంకు ఇచ్చిన హామీలన్నీనెరవేర్చి, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. అలాగే.. జనసేన పార్టీ ఓటమిపై కార్యకర్తలు చింతించాల్ని పనిలేదన్నారు. తాము పైసా కూడా పంచకుండా ఎన్నికల్లో పోటీచేశామని, దాదాపు లక్ష ఓట్లు మా పార్టీకే పడ్డాయన్నారు. ప్రజలు కరెప్షన్, అవినీతి లేని ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారని […]

జగన్‌కు మా మద్దతు తప్పక ఉంటుంది..!

Edited By:

Updated on: May 27, 2019 | 4:45 PM

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, జనసేన నేత, ప్రముఖ నటుడు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీకి మంచి సుపరిపాలన అందించే విషయంలో తమ సహకారం ఎప్పుడూ జగన్‌కు ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. జనంకు ఇచ్చిన హామీలన్నీనెరవేర్చి, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. అలాగే.. జనసేన పార్టీ ఓటమిపై కార్యకర్తలు చింతించాల్ని పనిలేదన్నారు. తాము పైసా కూడా పంచకుండా ఎన్నికల్లో పోటీచేశామని, దాదాపు లక్ష ఓట్లు మా పార్టీకే పడ్డాయన్నారు. ప్రజలు కరెప్షన్, అవినీతి లేని ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఓడిపోయినందుకు కొంత బాధగానే ఉన్నా.. మళ్లీ ప్రయత్నించడం మాత్రం ఆగదని అన్నారు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కొన్ని రోజులు విరామం తీసుకోవాలని, హాయిగా విహారయాత్రలకు వెళ్లి రిలాక్స్ అవ్వమని సలహా ఇచ్చారు నాగబాబు.