ABCI Award for Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఏబీసీఐ అవార్డు.. ఏ విభాగంలో ఈ అవార్డు వచ్చిందంటే..

ABCI Award for Hyderabad Metro: హైదరాబాద్ ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏబీసీఐ అవార్డులను అందుకుంది.

ABCI Award for Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఏబీసీఐ అవార్డు.. ఏ విభాగంలో ఈ అవార్డు వచ్చిందంటే..

Updated on: Dec 31, 2020 | 8:38 AM

ABCI Award for Hyderabad Metro: హైదరాబాద్ ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏబీసీఐ అవార్డులను అందుకుంది. వెబ్‌ కమ్యూనికేషన్‌– ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌, ఇంటర్నల్‌ బ్రాడ్‌కాస్ట్‌ –ఇంట్రానెట్‌ విభాగాలలో ఈ అవార్డు లభించింది. ముంబైలో అసోసియేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమ్యూనికేటర్స్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన 59వ వార్షిక అవార్డ్స్‌ నైట్‌ 2020లో ఈ అవార్డులను అందజేయనున్నారు. 1957 నుంచి వ్యాపార కమ్యూనికేషన్స్‌ ప్రొఫెషనల్స్‌ కోసం భారతదేశంలో అతిపెద్ద లాభాపేక్ష లేని సంస్థగా ఏబీసీఐ వెలుగొందుతుంది.

వృత్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడం, సమాజాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయ నాయకత్వం ఏర్పాటు చేయడం అనే మూడు ప్రధాన విభాగాలలో బిజినెస్‌ కమ్యూనికేషన్స్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషన్స్‌ను ఏబీసీఐ నిర్మిస్తుంది. ఈ సందర్భంగా ఎల్​అండ్​టీ మెట్రో ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఏబీసీఐ జాతీయ అవార్డులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డులు తమ బృందం కష్టం, ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ప్రత్యేకంగా తమ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ శాఖను అభినందిస్తున్నట్లు చెప్పారు. సృజనాత్మక, వినూత్న ప్రచారాల ద్వారా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణీకులకు చేరువ కావడంతో పాటుగా ప్రయాణీకుల సంఖ్య వృద్ధి సాధ్యమయ్యేలా చేశారన్నారు.