పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప వృద్ధి!

| Edited By:

May 24, 2019 | 8:55 PM

ఎన్నికల హడావిడి ముగిసింది. పెట్రోల్ వడ్డన మొదలైంది. దేశీ ఇంధన ధరలు పెరిగాయి. శుక్రవారం (మే 24) పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 18 పైసలు పైకి కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.71.39, డీజిల్ ధర లీటర్‌కు రూ.66.45గా ఉంది. గురువారం పెట్రోల్ ధరలు 71.25, డీజిల్ రూ.66.29గా ఉన్నాయి. శుక్రవారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.86, డీజిల్ ధర రూ.69.46గా ఉంది. […]

పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప వృద్ధి!
Follow us on

ఎన్నికల హడావిడి ముగిసింది. పెట్రోల్ వడ్డన మొదలైంది. దేశీ ఇంధన ధరలు పెరిగాయి. శుక్రవారం (మే 24) పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 18 పైసలు పైకి కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.71.39, డీజిల్ ధర లీటర్‌కు రూ.66.45గా ఉంది. గురువారం పెట్రోల్ ధరలు 71.25, డీజిల్ రూ.66.29గా ఉన్నాయి. శుక్రవారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.86, డీజిల్ ధర రూ.69.46గా ఉంది. చెన్నై, కోల్‌కతాలలో పెట్రోల్ ధర వరుసగా రూ.73.32, రూ.73.95గా ఉంది. డీజిల్ ధర రూ.68.05, 70.07గా ఉంది. హైదరాబాదులో పెట్రోల్ ధర 15 పైసలు పెరగగా, డీజిల్ ధర 18 పైసలు పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ ధర లీటరుకు రూ.75.72, డీజిల్ ధర రూ.72.27గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 16 పైసలు పెరిగింది. దీంతో అమరావతిలో పెట్రోల్ లీటరుకు రూ.75.47, డీజిల్ రూ.71.62కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ రూ.75.12, డీజిల్ 71.30కు చేరుకుంది.