wonder kid From Odisha: సాఫ్టవేర్ కోడింగ్‌పై పట్టు సాధించడమంటే అంత సులభమైన విషయం కాదు. పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా కోడింగ్ రాయలేక చేతులెత్తుస్తుంటారు. అయితే ఒడిశాకు చెందిన ఓ ఏడేళ్ల కుర్రాడు మాత్రం అవలీలగా కోడింగ్ రాసేస్తున్నాడు. తన అసమాన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడీ బుడ్డోడు.
వివరాల్లోకి వెళితే… ఒడిశాకు చెందిన వెంకట్ రామన్ పట్నాయక్ అనే కుర్రాడు ఏడేళ్ల వయసులోనే ఏకంగా 250 అప్లికేషన్స్‌కు కోడింగ్ రాశాడు. మహా మహా కంప్యూటర్ ఇంజనీర్లకే ఎంతో కష్టమైన పనిని అవలీలగా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన తల్లిదండ్రుల సహకారంతో చిన్నతనం నుంచే కోడింగ్‌పై ఆసక్తి పెంచుకున్న వెంకట్ 250 అప్లికేషన్స్‌కు కోడింగ్ రాశాడు. దీంతో అతి చిన్న వయసులోనే ఇన్ని అప్లికేషన్లకు కోడింగ్ రాసి ఘనత సాధించిన కుర్రాడిగా వెంకట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ పరీక్షలో నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించాడు. వెంకట్ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు.