అక్కడ సెల్ఫీ దిగారో జరిమానాలు ఖాయం.. ఎక్కడంటే ?

| Edited By: Rajesh Sharma

Nov 13, 2019 | 3:58 PM

ఈ మధ్యకాలంలో యువత ఎక్కడ చూసినా సెల్ఫీలు దిగడం అలవాటుగా మార్చుకున్నారు. పర్యాటక ప్రదేశానికి వెళ్తే చాలు.. కొందరి చేతిలో ముందుగా సెల్ఫీ స్టిక్స్ దర్శనమిస్తుంటాయి. ఏ మాత్రం పరిస్థితులను గమనించకుండా ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూడా సెల్ఫీల కోసం ఎగబడుతూ.. ఈతరం యువత ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ఇదిలా ఉంటే మన భాగ్యనగరం యువత ధోరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేస్ ఏదైనా.. అది రద్దీగా ఉన్నా.. ప్రమాదకరమైనది అయినా.. సెల్ఫీలు దిగడానికి ఎగబడుతున్నారు. ఆ […]

అక్కడ సెల్ఫీ దిగారో జరిమానాలు ఖాయం.. ఎక్కడంటే ?
Follow us on

ఈ మధ్యకాలంలో యువత ఎక్కడ చూసినా సెల్ఫీలు దిగడం అలవాటుగా మార్చుకున్నారు. పర్యాటక ప్రదేశానికి వెళ్తే చాలు.. కొందరి చేతిలో ముందుగా సెల్ఫీ స్టిక్స్ దర్శనమిస్తుంటాయి. ఏ మాత్రం పరిస్థితులను గమనించకుండా ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూడా సెల్ఫీల కోసం ఎగబడుతూ.. ఈతరం యువత ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు.

ఇదిలా ఉంటే మన భాగ్యనగరం యువత ధోరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేస్ ఏదైనా.. అది రద్దీగా ఉన్నా.. ప్రమాదకరమైనది అయినా.. సెల్ఫీలు దిగడానికి ఎగబడుతున్నారు. ఆ సెల్ఫీ కాస్తా కిల్ఫీగా మారుతుండటంతో.. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలను నియంత్రించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట.

భాగ్యనగరం మొత్తానికి 50 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్లు’గా గుర్తించినట్లు సమాచారం. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రదేశాలు, వాటర్ ప్లేస్‌లు, కొండలు, గుట్టలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇకపోతే కీసర గుట్ట, ఘట్ కేసరి, గండిపేట చెరువు, బయోడైవర్సిటీ ప్లై ఓవర్, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అటు సైబరాబాద్ ఏరియాలోనే దాదాపు 10 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్లు’గా గుర్తించడం గమనార్హం.

బయోడైవర్సిటీ న్యూ ఫ్లై ఓవర్…

ఇటీవలే బయోడైవర్సిటీ జంక్షన్‌లో మెహిదీపట్నం నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఫ్లై ఓవర్‌పై సెల్ఫీలు తీసుకోవడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ట్రాఫిక్ ఉండే ఈ ప్రాంతంలో యువత ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. దీంతో అనుకోని యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి.

నెక్లెస్ రోడ్(లవ్ హైదరాబాద్)…

నెక్లెస్ రోడ్ అంటేనే లవర్స్ ఎక్కువగా ఉండే ప్రదేశం. అంతేకాకుండా నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. పక్కనే హుస్సేన్ సాగర్.. టూరిస్ట్ స్పాట్ లాంటి నెక్లెస్ రోడ్‌లో యువత సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడటం సహజం. దీంతో ట్రాఫిక్ అనేది పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపిస్తారు. కొన్నిసార్లు ఆ సెల్ఫీలే కిల్ఫీలుగా కూడా మారుతుంటాయి.