సుప్రీంకోర్టును ఆశ్రయించిన‌ మరో ఐదుగురు ఎమ్మెల్యేలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2019 | 4:52 PM

కర్ణాటక రాజకీయాలు మరింత హాట్ హాట్‌గా మారిపోతూనే ఉన్నాయి… బలనిరూపణకు సిద్ధమంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ప్రకటించగా.. ఇవాళ మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. తమ రాజీనామాలను ఆమోదించేలా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు రెబల్ ఎమ్మెల్యేలు. తాజాగా అత్యున్నతన్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఎమ్మెల్యేలు సుధాకర్, రోషన్, నాగరాజు, మునిరత్నం కూడా ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. […]

సుప్రీంకోర్టును ఆశ్రయించిన‌ మరో ఐదుగురు ఎమ్మెల్యేలు
Follow us on

కర్ణాటక రాజకీయాలు మరింత హాట్ హాట్‌గా మారిపోతూనే ఉన్నాయి… బలనిరూపణకు సిద్ధమంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ప్రకటించగా.. ఇవాళ మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. తమ రాజీనామాలను ఆమోదించేలా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు రెబల్ ఎమ్మెల్యేలు.

తాజాగా అత్యున్నతన్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఎమ్మెల్యేలు సుధాకర్, రోషన్, నాగరాజు, మునిరత్నం కూడా ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. రామలింగారెడ్డి మినహా రెబల్ ఎమ్మెల్యేలు మొత్తం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, రెబెల్స్ ఎమ్మెల్యేలంతా స్పీకర్‌ను కలవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. తాము స్వచ్ఛందంగా రాజీనామాలు ఇస్తే స్పీకర్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని మొదట సుప్రీంను ఆశ్రయించిన ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈనెల 12న ప్రారంభమైన శాసనసభా కార్యాక్రమాల్లో పాల్గొనకుంటే అనర్హత వేటు వేస్తామంటూ విప్ జారీ చేశారు’ అని ఆ పిటిషన్ పేర్కొంది. ఈనెల 10న రాజీనామా సమర్పించేందుకు వెళ్లిన కొంత మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో చేయిచేసుకోవడం, నిర్బంధించడం వంటివి జరిగాయని కూడా వారు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.