పాకిస్తాన్‌లో పేలుడు.. 5గురు మృతి.. 10మందికి గాయాలు!

పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. చమన్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి

పాకిస్తాన్‌లో పేలుడు.. 5గురు మృతి.. 10మందికి గాయాలు!

Edited By:

Updated on: Aug 10, 2020 | 2:51 PM

పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. చమన్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల సమీపంలోని మెకానిక్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది.

భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ బ్లాస్ట్‌ ఎవరు, ఎందుకు చేశారో అనే అంశంపై ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం చమన్ పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో దాడులు పెరిగిపోయాయి. జూలై 21న టర్బాట్ బజార్‌లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!