మహిళను లాక్కెళ్లిన మెట్రో రైలు.. తలకు గాయాలు

| Edited By:

Apr 16, 2019 | 3:07 PM

మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న 40ఏళ్ల మహిళకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మెట్రో నుంచి దిగుతున్న సమయంలో ఆమె చీర డోర్ మధ్యలో ఇరుక్కుంది. ఈ విషయాన్ని గమనించని లోకో పైలెట్ ట్రైన్‌ను ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో ట్రైన్‌లో తన కుమార్తెతో కలిసి గీత అనే ప్రయాణికురాలు నవాడా నుంచి మోతీ నగర్‌కు ప్రయాణించింది. మోతీ నగర్ వచ్చాక దిగే […]

మహిళను లాక్కెళ్లిన మెట్రో రైలు.. తలకు గాయాలు
Follow us on

మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న 40ఏళ్ల మహిళకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మెట్రో నుంచి దిగుతున్న సమయంలో ఆమె చీర డోర్ మధ్యలో ఇరుక్కుంది. ఈ విషయాన్ని గమనించని లోకో పైలెట్ ట్రైన్‌ను ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మెట్రో ట్రైన్‌లో తన కుమార్తెతో కలిసి గీత అనే ప్రయాణికురాలు నవాడా నుంచి మోతీ నగర్‌కు ప్రయాణించింది. మోతీ నగర్ వచ్చాక దిగే సమయంలో ఆమె చీర డోర్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ తరువాత ట్రైన్ ఆమెను కాస్త దూరం లాక్కెళ్లింది. అయితే ఈ విషయాన్ని గమనించిన మెట్రో ప్రయాణికులు ఎమర్జెన్సీ బటన్‌ను ప్రెస్ చేశారు. దీంతో లోకో పైలెట్ మెట్రోను ఆపేశాడు. అయితే ఆ లోపే గీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను అంతా గమనిస్తున్న గీత కుమార్తె వెంటనే తేరుకొని తన తల్లిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. మరోవైపు ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు. దీని వలన మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని వారు వెల్లడించారు.