భూ ప్రకంపనలతో ఇవాళ ఉదయం మూడు రాష్ట్రాలు వణికిపోయాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లలో ఈరోజు ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 4.8గా నమోదైంది. అయితే భూ ప్రకంపనలతో జనం ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో.. బీహార్‌లోని బాంకా.. పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు సెకెన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. అలాగే జార్ఖండ్‌లోని ధన్బాద్, సంతాల్ కోయలాంచల్‌లలో కూడా భూకంప సూచనలు కనిపించాయి. ఈ భూకంపం ఉదయం 10:38 గంటలకు వచ్చినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Earthquake of Magnitude:4.8, Occurred on:26-05-2019, 10:39:15 IST, Lat:23.3 N & Long: 86.9 E, Depth 10 Km, Region: Bankura, West Bengal pic.twitter.com/LfNqXswG2J
— India Met. Dept. (@Indiametdept) May 26, 2019