
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర సంగతి చెప్పక్కర్లేదు. అక్కడ ఈ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా మరణాల సంఖ్యా మహారాష్ట్రను వణికిస్తోంది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 3827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,331కి చేరింది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 142 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5893కు చేరింది.
ఇప్పటివరకు ముంబై మహానగరంలోనే 64,068 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 1269 కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. ముంబైలో నేటివరకు మొత్తంగా 1269 మంది కరోనా వల్ల మరణించారు.
Also Read: ఆన్‌లైన్ బోధనకోసం ‘విద్యాదాన్’