Illegal sand mining: రెచ్చిపోతున్న ఇసుకాసురులు..కేసులు పెడుతున్నా వెనక్కి తగ్గడం లేదు..3 ట్రాక్టర్లు సీజ్

|

Jan 04, 2021 | 1:49 PM

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారుల కన్నుగప్పి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.  మంత్రాలయం మండలం బూదూరు వంక నుంచి...

Illegal sand mining: రెచ్చిపోతున్న ఇసుకాసురులు..కేసులు పెడుతున్నా వెనక్కి తగ్గడం లేదు..3 ట్రాక్టర్లు సీజ్
Follow us on

Illegal sand mining: కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారుల కన్నుగప్పి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.  మంత్రాలయం మండలం బూదూరు వంక నుంచి ఎమ్మిగనూరుకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లుపై పోలీసులు దాడులు చేశారు.  మూడు ట్రాక్టర్లు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.

ఇసుక కొరత కారణంగా అక్రమంగా తరలింపుకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఒక్క ట్రాక్టర్ ఇసుక రూ 4 వేల నుండి 6 వేల రూపాయలకు అమ్మి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వ అదేశాలతో అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ..కేసులు పెడుతున్నా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Also Read : Sourav Ganguly health update: దాదా ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల..నేడు ఈకో కార్డియోగ్రఫీ నిర్వహించనున్న వైద్యులు

RX100 Hindi remake: ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిందీ రీమేక్.. ఒరిజినల్‌కు మించి రొమాన్స్ సీన్స్ ఉంటాయని మేకర్స్ హింట్