ఝార్ఖండ్‌లో మావోలకు చెక్.. ముగ్గురు హతం

| Edited By: Ravi Kiran

Apr 15, 2019 | 6:19 PM

సార్వత్రిక ఎన్నికల వేడి ఝార్ఖండ్‌కు అప్పుడే తగిలింది. ఎన్నికలను బాయ్‌కాట్ చేయాల్సిందిగా మావోలు స్థానికులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జవాన్లు అప్రమత్తం అయ్యారు. ఎన్‌కౌంటర్లకు శ్రీకారం చుట్టారు. ఝార్ఖండ్‌లోని గిరదీహ్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, సీఆర్ఫీఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు హతం కాగా.. ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. కాగా ఝార్ఖండ్‌లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదీహ్ జిల్లా బెల్బాఘాట్ అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ ఏడో బెటాలియన్‌కు చెందిన జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ […]

ఝార్ఖండ్‌లో మావోలకు చెక్.. ముగ్గురు హతం
Follow us on

సార్వత్రిక ఎన్నికల వేడి ఝార్ఖండ్‌కు అప్పుడే తగిలింది. ఎన్నికలను బాయ్‌కాట్ చేయాల్సిందిగా మావోలు స్థానికులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జవాన్లు అప్రమత్తం అయ్యారు. ఎన్‌కౌంటర్లకు శ్రీకారం చుట్టారు. ఝార్ఖండ్‌లోని గిరదీహ్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, సీఆర్ఫీఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు హతం కాగా.. ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు.

కాగా ఝార్ఖండ్‌లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదీహ్ జిల్లా బెల్బాఘాట్ అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ ఏడో బెటాలియన్‌కు చెందిన జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు మావోలను హతమార్చారు. ఘటనాస్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 3 బులెట్ మ్యాగజైన్లు, 4పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.