29 Arrested For Playing Poker: పేకాట ఆడుతున్న 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు గురువారం రాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు కారేపల్లిలో పేకాట ఆడుతున్న 29 మందిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. సీఐ వెంకటస్వామి, ఎస్సై సతీష్ కుమార్, కారేపల్లి ఎస్సై సురేష్ తమ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు.
నిందితుల నుంచి రూ.3,20,720 నగదు, 4 కార్లు,8 బైక్‌లు,29 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టుబడ్డ వారిని కారేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్