అస్సాంలో భారీ వర్షాలు.. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 20 మంది మృతి..

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 2:50 PM

గత రెండు రోజులుగా అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరుసగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్ర‌మాదంలో సుమారు 20 మంది మృతిచెందిన‌ట్లు స‌మాచారం. అనేక మంది గాయ‌ప‌డ్డారు.

అస్సాంలో భారీ వర్షాలు.. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 20 మంది మృతి..
Follow us on

గత రెండు రోజులుగా అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరుసగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్ర‌మాదంలో సుమారు 20 మంది మృతిచెందిన‌ట్లు స‌మాచారం. అనేక మంది గాయ‌ప‌డ్డారు. ద‌క్షిణ అస్సాంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది. బ‌రాక్ వ్యాలీ ప్రాంతంలో ఉన్న ప‌లు జిల్లాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. గ‌త కొన్ని రోజుల నుంచి అస్సాంలో భీక‌రంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. క‌చార్ జిల్లాలో ఏడు మంది, హైల‌కండి జిల్లాలో ఏడు మంది, క‌రీంగంజ్ జిల్లాలో ఆరు మంది మ‌ర‌ణించారు.

ఈ వర్షాలవల్ల సుమారు 3.72 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. గోల్పారా జిల్లా అత్యధికంగా దెబ్బతింది, తరువాత నాగాన్ మరియు హోజాయ్ ఉన్నాయి. వరదల్లో ఆరుగురు మరణించగా, 348 గ్రామాలు నీటిలో మునిగాయి. దాదాపు 27,000 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) తెలిపింది.

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..