“నేను కూడా జాతి వివక్ష ఎదుర్కున్నా, క్రికెట్​లోనూ ఆ జాడ్యం ఉంది”

నేను కూడా జాతి వివక్ష ఎదుర్కున్నా, క్రికెట్​లోనూ ఆ జాడ్యం ఉంది

అమెరికాలో నల్లజాతీయుడైన‌‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి సంతాపం తెలిపిన ఈ విండీస్​ ప్లేయర్​... అనంతరం జాతి వివక్షపై కామెంట్స్ చేశాడు. అన్ని క్రీడల్లాగే క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష ఉందని పేర్కొన్నాడు.

Ram Naramaneni

|

Jun 02, 2020 | 2:38 PM

క్రికెట్ కాస్త ట‌చ్ ఉన్న‌వాళ్లంద‌రికీ వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్‌‌ క్రిస్‌గేల్ ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ‌ప‌నిలేదు. గ్రౌండ్ లోకి దిగితే చాలు విధ్వంసకర ఆట‌తీరుతో బౌల‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెడ‌తాడు గేల్. అత‌డ్ని త్వ‌ర‌గా ఔట్ చేస్తే చాలు సగం మ్యాచ్ గెలిచిన‌ట్లేన‌ని ప్ర‌త్య‌ర్థి టీమ్ భావిస్తోంది. అటువంటి గొప్ప‌ ఆటగాడు జాతి వివక్ష ఎదుర్కొన్నట్లు చెప్పి సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. అమెరికాలో నల్లజాతీయుడైన‌‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి సంతాపం తెలిపిన ఈ విండీస్​ ప్లేయర్​… అనంతరం జాతి వివక్షపై కామెంట్స్ చేశాడు. అన్ని క్రీడల్లాగే క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష ఉందని పేర్కొన్నాడు. అయితే ఎవరూ తనకి ఇబ్బందులు సృష్టించారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఓ గ్లోబల్​ టీ20 లీగ్​లోనే ఆ అవమానం ఎదుర్కొన్నట్లు వివ‌రించాడు.

” క్రికెట్​ టోర్నీల్లో భాగంగా చాలా దేశాల‌లో పర్యటించాను. ఆ సమయంలో నా క‌ల‌ర్ కారణంగా వివక్షతను ఎదుర్కొన్నాను. నల్ల జాతీయులు కూడా అందరిలాంటి మ‌నుషులే. మమ్మల్ని ద్వేషించొద్దు. నలుపు అనేది బలం, నలుపు గర్వకారణం” అని గేల్​ పేర్కొన్నాడు. ప్రజంట్ ‘బ్లాక్​ లివ్స్​ మ్యాటర్’​‌, ‘ఐ కాంట్​ బ్రీత్’​ స్లోగ‌న్స్ తో అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu