అరటి పండ్ల‌లో విషం కలిపి 20 పశువులను చంపేశారు…

కాఫీ తోటలోకి చొరబడుతున్నాయనే కార‌ణంతో అరటిపండ్లలో విషం పెట్టి ఏకంగా 20 పశువుల ప్రాణాలు తీశారు కొంద‌రు దుర్మార్గులు. ఈ అమానుష ఘ‌ట‌న కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఐగూరు ఎస్టేట్‌లో చోటుచేసుకుంది.

అరటి పండ్ల‌లో విషం కలిపి 20 పశువులను చంపేశారు...

Updated on: Jul 20, 2020 | 8:56 AM

కాఫీ తోటలోకి చొరబడుతున్నాయనే కార‌ణంతో అరటిపండ్లలో విషం పెట్టి ఏకంగా 20 పశువుల ప్రాణాలు తీశారు కొంద‌రు దుర్మార్గులు. ఈ అమానుష ఘ‌ట‌న కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఐగూరు ఎస్టేట్‌లో చోటుచేసుకుంది. కాఫీ తోట మేనేజరు, ఇతర సిబ్బంది ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. గ్రామ శివారులోని త‌మ కాఫీ తోట‌లోకి వ‌చ్చి పంట నాశనం చేస్తున్నాయ‌ని వారు ఈ పైశాచికత్వం ప్రద‌ర్శించారు.

సమీపంలోని గ్రామం నుంచి ప‌శువులు ప్ర‌తి రోజూ ఎస్టేట్‌ వైపు మేతకోసం వెళ్లేవి. తోటను నాశనం చేస్తున్నాయంటూ అక్క‌డి మేనేజ‌ర్, స్టాఫ్ కలిసి అరటిపండ్లలో విషం పెట్టి ఆవులకు తినిపించేవారు. డేంజ‌ర‌స్ పాయిజ‌న్ కావ‌డంతో వాటిని తిన్న ఆవులు అక్క‌డే మ‌ర‌ణించేవి. ఈ విషయం బయటకు పొక్కకుండా తోటలోనే గొయ్యి తీసి వాటిని పూడ్చి పెడుతూ వ‌చ్చారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు 20 పశువుల్ని బ‌లిగొన్నారు. పెద్ద సంఖ్య‌లో పశువులు క‌నిపించ‌కుండాపోవ‌డంతో..వాటి కోసం వెతుక్కుంటూ యజమానులు ఆదివారం కాఫీ తోటవైపు వచ్చారు. అక్కడి గొయ్యిలో పశువుల కళేబరాలు కనిపించడంతో అనుమానం వ‌చ్చింది. ఎస్టేట్ స్టాఫ్ ను నిల‌దీయడంతో అసలు విషయం బ‌య‌ట‌ప‌డింది. ఘ‌ట‌న‌పై స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేశారు.