కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఇవాళ ఒక్కరోజే 1,694 పాజిటివ్ కేసులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా కర్ణాటకలో

కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఇవాళ ఒక్కరోజే 1,694 పాజిటివ్ కేసులు..

Edited By:

Updated on: Jul 03, 2020 | 11:19 PM

Coronavirus In Karnataka: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా కర్ణాటకలో 1,694 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,710కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 10,608.

లాక్‌డౌన్ సడలింపులతో కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 21 మంది కరోనా వల్ల మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో.. కర్ణాటకలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 293కి చేరింది. ఇప్పటివరకు 8,805 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ ఒక్కరోజే.. 471 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. 201 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

[svt-event date=”03/07/2020,11:10PM” class=”svt-cd-green” ]

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..