తెలంగాణలో ఒక్క రోజే 169 క‌రోనా కేసులు…

|

May 29, 2020 | 10:55 PM

తెలంగాణలో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. శుక్రవారం కొత్తగా రాష్ట్రంలో మొత్తం రికార్డు లెవ‌ల్ లో 169 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో అత్య‌ధికంగా 82 కేసులు ఉండ‌గా, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు కేసుల చొప్పున న‌మోద‌య్యాయి. అంతేకాక, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 64 కొత్త కేసులను శుక్రవారమే గుర్తించడం గ‌మనార్హం. మరో ఐదుగురు వలస కార్మికులకు […]

తెలంగాణలో ఒక్క రోజే 169 క‌రోనా కేసులు...
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. శుక్రవారం కొత్తగా రాష్ట్రంలో మొత్తం రికార్డు లెవ‌ల్ లో 169 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో అత్య‌ధికంగా 82 కేసులు ఉండ‌గా, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు కేసుల చొప్పున న‌మోద‌య్యాయి. అంతేకాక, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 64 కొత్త కేసులను శుక్రవారమే గుర్తించడం గ‌మనార్హం. మరో ఐదుగురు వలస కార్మికులకు కూడా కోవిడ్-19 సోకింది. ఒక ఒక్కరోజే మరో నలుగురు కరోనాతో చనిపోయినట్లుగా వైద్య‌,ఆరోగ్య‌శాక అధికారులు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక ఇప్పటి వరకూ 1381మంది వ్యాధి న‌యమై వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో క‌రోనా యాక్టివ్ కేసులు సంఖ్య‌ 973గా ఉంది.