ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు బదిలీలు..

| Edited By:

Jul 09, 2020 | 5:00 AM

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. మరోవైపు ఏపీలో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు హైకోర్టు బదిలీలు

ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు బదిలీలు..
Follow us on

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. మరోవైపు ఏపీలో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు హైకోర్టు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 15 లోపు రిలీవ్‌ కావాలని, 22 లోపు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ నిధికి 2020-21 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా రూ.25 కోట్లు విడుదల చేసింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదుల సంక్షేమం కోసం దీనిని ఖర్చు చేస్తారు.

Also Read: బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..