ఒకే ఒక్క ఛాన్స్.. నిర్భయ దోషుల ఉరి కోసం ఉరకలెత్తుతున్న జనం..

|

Dec 12, 2019 | 4:52 PM

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై జరిగిన అమానుష ఘటనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగేలా కనిపిస్తోంది. నిర్భయ కేసులోని నిందితులను ఈ నెలలోనే ఉరి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దోషులను తాము ఉరి తీస్తామంటూ దేశ విదేశాల నుంచి తీహార్ జైలు అధికారులకు సుమారు 15 లేఖలు పంపారట. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, చత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా లండన్, అమెరికా దేశాల నుంచి కూడా తాము నిర్భయ కేసు నేరస్తులకు తలారీలుగా […]

ఒకే ఒక్క ఛాన్స్.. నిర్భయ దోషుల ఉరి కోసం ఉరకలెత్తుతున్న జనం..
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై జరిగిన అమానుష ఘటనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగేలా కనిపిస్తోంది. నిర్భయ కేసులోని నిందితులను ఈ నెలలోనే ఉరి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దోషులను తాము ఉరి తీస్తామంటూ దేశ విదేశాల నుంచి తీహార్ జైలు అధికారులకు సుమారు 15 లేఖలు పంపారట. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, చత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా లండన్, అమెరికా దేశాల నుంచి కూడా తాము నిర్భయ కేసు నేరస్తులకు తలారీలుగా వ్యవహరిస్తామంటూ కొందరు తమ లేఖలను తీహార్ జైలుకు పంపించినట్లుగా తెలుస్తోంది.

ఈ లేఖలు రాసినవారిలో చార్టర్డ్ అకౌంటెంట్, ఇంజనీర్, అడ్వకేట్, సీనియర్ సిటిజన్ తదితరులు ఉండటం గమనార్హం. కాగా, ధర్మాసనం నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేస్తే.. ఉరి వేసేందుకు తలారీలు దొరకట్లేదంటూ తీహార్ జైలు అధికారులు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆ దోషులను శిక్షించడానికి తామందరం సిద్ధమేనంటూ ప్రజలు లేఖలు రాశారు.

గతంలో వివిధ జైళ్లలో ఉన్న నిర్భయ దోషులందరిని.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉంచిన సంగతి విదితమే. ఇక డిసెంబర్ 17న వీరిని ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తీహార్ జైలులోని కోర్టు నెంబర్ 3లో నిందితులను ఉరి తీయనున్నారట. అంతేకాకుండా గతంలో మాక్బూల్ భట్, అఫ్జల్ గురులను పూడ్చి పెట్టిన ఫన్సీ కొత అనే ప్రదేశంలోనే.. నిర్భయ దోషులను కూడా పూడ్చి పెడతారని సమాచారం. కాగా, దిశ ఘటన అనంతరం అత్యాచారాలు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలను వెంటనే ఉరి తీయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.