
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఐతే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో గల బయానా పట్టణం గత కొన్ని రోజులుగా కరోనా హాట్ స్పాట్‌గా ఉంది. ఇదే ప్రాంతం పరిధిలోని కసాయీ పాడాకు చెందిన కాసిం అనే 11 ఏళ్ల బాలుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అ బాలుడిని ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచారు. 52 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, కాసిం కరోనా నుంచి కోలుకోలేదు. 12సార్లు నిర్వహించిన వైద్యపరీక్షల్లోనూ కాసింకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యులు కూడా కలత చెందారు.
కాగా.. చివరికి కరోనాపై 11 ఏళ్ల కాసిం విజయం సాధించాడు. 13వ సారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కాసింతో పాటు వైద్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాసిం ఉంటున్నప్రాంతంలో 99 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ ప్రాంతం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. ఆ సమయంలో కాసిం కూడా పాజిటివ్‌గాఉన్నాడు. అతని తల్లిదండ్రులు కూడా పాజిటివ్‌గా తేలినప్పటికీ, ఆసుపత్రిలో చికిత్స పొంది, వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. 13వ సారి నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. దీంతో కాసిం వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నాడు.
కోవిద్-19పై విజయం సాధించి, 52 రోజుల తరువాత.. ఇంటికి చేరుకున్న కాసిం తన తల్లితో ఆనందంగా ఉన్నాడు. అలాగే స్నేహితులతో ఆడుకుంటున్నాడు. కాగా కరోనా బాధితుడైన 11 ఏళ్ల కాసిం వైద్యులను ఆశ్చర్యపరిచాడు. ఈ చిన్నారిపై పరిశోధనలు చేయాలని ఆరోగ్య శాఖ యోచిస్తోంది. కాసింకు చేసిన 13వ, 14 వ వైద్య పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరువాత ఆ బాలుడిని డిశ్చార్జ్ చేశారు.
Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ