న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు: సీఎం జగన్‌

| Edited By:

May 25, 2020 | 6:01 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే.. లాయర్ల కార్పస్‌ నిధికి సీఎం జగన్‌ రూ.100 కోట్లు ప్రకటించారు.

న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు: సీఎం జగన్‌
Follow us on

lawyer corpus fund: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే.. లాయర్ల కార్పస్‌ నిధికి సీఎం జగన్‌ రూ.100 కోట్లు ప్రకటించారు. నిధుల నిర్వహణ బాధ్యత వారికే అప్పగించాలని జగన్‌ ఆదేశించారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను అదుకుంటున్నామని జగన్‌ తెలిపారు.

కాగా.. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి విస్తరించడంపై జగన్‌ ఆరా తీశారు. కాళ్లవాపు వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని, తక్షణం బాధితులకు సరైన వైద్యం అందించాలని అధికారులకు జగన్‌ సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి మళ్లీ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నానిని, అధికారులను బాధితులను పరామర్శించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కాళ్లవాపు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

Also Read: రాష్ట్రవ్యాప్తంగా.. శ్రీవారి లడ్డూ విక్రయాలకు విశేష స్పందన..