రాహుల్‌పై వేటు.. రోహిత్‌కు చోటు!

Will Consider Rohit Sharma As Test Opener Says MSK Prasad, రాహుల్‌పై వేటు.. రోహిత్‌కు చోటు!

వెస్టిండీస్ పర్యటనలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రాహుల్‌కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. విండీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లో రాహుల్ కేవలం 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టి.. విఫలమవుతున్న రాహుల్‌నే జట్టులోకి తీసుకోవడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో సెలెక్టర్లు దిగి వచ్చినట్లు ఉన్నారు. రాహుల్ స్థానంలో రోహిత్ శర్మను ఓపెనర్‌గా తీసుకుంటామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. గతంలో రాహుల్ ఇకపై టెస్టుల్లో ఓపెనర్‌గా ఉండటం పట్ల అనుమానం వ్యక్తం చేసిన గంగూలీ మాటలు నెమ్మదిగా నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

విండీస్ పర్యటన అనంతరం కమిటీ సమావేశం కాలేదని.. తదుపరి మ్యాచులలో రోహిత్ శర్మను ఓపెనర్‌గా తీసుకుంటామని ప్రసాద్ అన్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు ఒకసారి అందరం చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కేఎల్ రాహుల్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ, టెస్టు క్రికెట్ లో గడ్డు కాలం నడుస్తోంది. అతను తన ఫామ్ తిరిగి తెచ్చుకోవాల్సి ఉంది. మైదానంలో ఇంకా ప్రాక్టీస్ చేసి ఫామ్ పుంజుకుంటాడని ఆశిస్తున్నాం’ అని వెల్లడించాడు.

టీమిండియా వెస్టిండీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లను భారత్ అలవోకగా విజయం సాధించింది. అన్ని రంగాల్లోనూ కోహ్లీసేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా మరో ఐదు రోజుల్లో టీమిండియా సఫారీలతో సిరీస్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15న ఇరు జట్ల మధ్య తొలి టీ20 ధర్మశాల వేదికగా జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *