పిల్లే కానీ బాతులా.. నెటిజన్లను ‘వావ్’ అనిపిస్తోన్న వీడియో

Kitten that quacks like a duck, పిల్లే కానీ బాతులా.. నెటిజన్లను ‘వావ్’ అనిపిస్తోన్న వీడియో

పిల్లి ఎలా అరుస్తుంది..? ఈ ప్రశ్నను సరిగా మాటలు రాని వాడిని అడిగినా.. ‘‘మ్యావ్.. మ్యావ్’’ అంటూ నోరు తిప్పుకుంటూ మరీ సమాధానమిస్తారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న పిల్లి మాత్రం ‘మ్యావ్ మ్యావ్’ కాదు ’క్వాక్ క్వాక్’ అంటూ బాతులా శబ్ధం చేస్తోంది. ఎడిన్ బర్గ్‌లోని పాల్మ్ వాలీ అనిమల్ సెంటర్‌లో ఉన్న ఈ పిల్లి, బాతులా అరిచే వీడియోను సారా త్రోన్‌టన్ అనే నెటిజన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ తరువాత అది కాస్త వైరల్‌గా మారగా.. నెటిజన్లు ‘‘వావ్.. సో క్యూట్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ తరువాత ఈ పిల్లిని ఒక జంట దత్తత తీసుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు. అన్నట్లు ఈ పిల్లికి ఓ పేరుందండి.. అదేంటంటే మెల్విన్. మరి మెల్విన్ ఇలా అరిచేందుకు కారణం కొద్దిరోజులుకైనా తెలుస్తుందేమో చూద్దాం.

Meet Melvin, a new little kitten who we met today at Palm Valley Animal Center in Edinburg, TX.Listen. To. That. Voice. ❤️[Edit] He’s ALREADY been adopted!! 😍 Congratulations lil dude ❤️

Sarah Thornton यांनी वर पोस्ट केले रविवार, १८ ऑगस्ट, २०१९

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *