కాశ్మీర్ సమస్యకు పరిష్కారం..? ఇద్దరి భేటీలో ఇదే ప్రధానాంశం !

kashmir on agenda as pm modi meets trump on g 7 summit sidelines in france, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం..? ఇద్దరి భేటీలో ఇదే ప్రధానాంశం !

ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ అతి ముఖ్యమైన కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరుపవచ్ఛునని తెలుస్తోంది. ఇది ద్వైపాక్షిక సమస్య అని ఇండియా చెబుతుండగా.. అవసరమైతే దీని పరిష్కారానికి తాను జోక్యం చేసుకుంటానని ట్రంప్ పదేపదే అంటున్నారు. మోదీతో బాటు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తన సహాయం కోరారని ఆయన ప్రకటించుకున్నారు. కానీ మూడో పార్టీ జోక్యం అవసరంలేదని భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం భారత అంతర్గత వ్యవహారమని వాషింగ్టన్ అభిప్రాయపడుతున్నట్టు ట్రంప్ ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. బహుశా ట్రంప్ మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించవచ్ఛు . కాశ్మీర్ కు సంబంధించి మానవ హక్కుల పరిరక్షణకు, ప్రాంతీయ ఉద్రిక్తతల నివారణకు మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన మోదీని ప్రశ్నించవచ్ఛునంటున్నారు. అలాగే పాకిస్తాన్ తన భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించాలని ట్రంప్ ఈ సమ్మిట్ సందర్భంగా హితవు చెప్పవచ్ఛు . మరోవైపు-తమ దేశ ఉత్పత్తులపై భారత్ సుంకాలు పెంచిన విషయాన్ని ట్రంప్.. మోదీ దృష్టికి తీసుకువచ్ఛే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇండియాను ఆయన ‘ టారిఫ్ కింగ్ ‘ గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా..ట్రంప్ తన నిరసనను తెలియజేయవచ్ఛు. కాగా-మోదీ ఆదివారం ఫ్రాన్స్ చేరుకున్న వెంటనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గెటర్స్ తో భేటీ అయ్యారు. కొన్ని ప్రధాన అంశాలపై ఆయనతో చర్చించారు. కాశ్మీర్ లోని పరిస్థితిపై గెటర్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఆర్టికల్ 370 రద్దు భారత ఆంతరంగిక వ్యవహారమని ఆయన కూడా అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల పరిరక్షణకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు. పాకిస్థాన్ కూడా సంయమనంతో వ్యవహరించాలని, తన గడ్డపై గల టెర్రరిస్టు శిబిరాలను తొలగించేందుకు పూనుకోవాలని ఆయన సూచించినట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *