బాలీవుడ్ లోకి లారెన్స్ చిత్రం..!

ముని సిరీస్ సీక్వెల్ గా రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కాంచన 3’. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు ముని సిరీస్ లో వచ్చే నాలుగో చిత్రాన్ని కూడా లారెన్స్ డైరెక్ట్ చేయనున్నాడట. ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం రాఘవ లారెన్స్ బాలీవుడ్ లో ఒక సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే ఈ చిత్రం లారెన్స్ నటించిన ‘కాంచన’ […]

  • Ravi Kiran
  • Publish Date - 2:53 pm, Fri, 15 March 19

ముని సిరీస్ సీక్వెల్ గా రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కాంచన 3’. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు ముని సిరీస్ లో వచ్చే నాలుగో చిత్రాన్ని కూడా లారెన్స్ డైరెక్ట్ చేయనున్నాడట.

ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం రాఘవ లారెన్స్ బాలీవుడ్ లో ఒక సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే ఈ చిత్రం లారెన్స్ నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.