రాజకీయాల్లో మీతో కలిసి పనిచేస్తా: రజనీకి కమల్ సమాధానం
రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వెల్లడించాడు. ఇటీవల జరిగిన బిగ్‌బాగ్ కార్యక్రమంలో కంటెస్టెంట్‌లు తమను ప్రముఖులుగా ఊహించుకొని కమల్ హాసన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు చేరన్ తాను రజనీకాంత్‌గా ఊహించుకుంటూ కమల్‌పై ప్రశ్నలు కురిపించాడు. ‘‘మనం నటులుగా 40ఏళ్లుగా ప్రయాణించాం. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలని నేను భావిస్తుండగా మీరు వచ్చేశారు. నటులుగా ప్రజలను సంతృప్తిపరిచిన మనం నాయకులుగా వారి కోరికలు […]

రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వెల్లడించాడు. ఇటీవల జరిగిన బిగ్‌బాగ్ కార్యక్రమంలో కంటెస్టెంట్‌లు తమను ప్రముఖులుగా ఊహించుకొని కమల్ హాసన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు చేరన్ తాను రజనీకాంత్‌గా ఊహించుకుంటూ కమల్‌పై ప్రశ్నలు కురిపించాడు.
‘‘మనం నటులుగా 40ఏళ్లుగా ప్రయాణించాం. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలని నేను భావిస్తుండగా మీరు వచ్చేశారు. నటులుగా ప్రజలను సంతృప్తిపరిచిన మనం నాయకులుగా వారి కోరికలు తీరేలా పని చేయగలమా..?’’ అంటూ రజనీ(చేరన్)ప్రశ్నించారు. దానికి కమల్ స్పందిస్తూ.. సాధ్యమా అంటే ప్రయత్నిస్తే అన్నీ సాధ్యమే. నేను అనేది మనంగా మారితే కచ్చితంగా ఏదైనా సాధ్యమే. దానిని ఈ రజనీ(చేరన్) వచ్చినా చెబుతా, ఆ రజనీ వచ్చినా చెబుతా అన్నారు. కాగా ఆదివారం ప్రసారమైన ఈ కార్యక్రమాలకు కోత పడగా.. వాటిని కమల్ పార్టీ మీడియా కన్వీనర్ మురళీ అబ్బాస్ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.