రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్‌గా ఎవరి ఫొటో ఉందో తెలుసా? క్లింకార మాత్రం కాదు..

27 March 2025

Basha Shek

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురువారం (మార్చి 27) తన పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు.

చెర్రీకి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బర్త్ డే విషెస్ చెబుతున్నారు

ఇక రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని అప్ కమింగ్ మూవీకి పెద్ది అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు

అలాగే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టిన రోజున అతనికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తన తల్లిదండ్రుల్లాగే రామ్ చరణ్ కూడా హనుమంతుడిని అమితంగా ఆరాధిస్తాడు. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పాడు.

అంతేకాదు తన ఇష్ట దైవమైన ఆంజనేయుడి ఫొటోనే తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్.

ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.