పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన సింధియా..

మధ్యప్రదేశ్ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటికి మొన్న బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన సింధియా..
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 10:49 PM

మధ్యప్రదేశ్ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటికి మొన్న బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆయనతో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా గురించి తెలిసిందే. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన.. హస్తానికి రాజీనామా చేయడమే కాకుండా.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలేలా చేశాడు. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలను కూడా వెంట తెచ్చుకుని బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు అతడు మళ్లీ పార్టీ మారుతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి కాస్త వైరల్ కావడంతో.. ఆయన పార్టీ మారే విషయంపై స్పందించారు. బీజేపీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనంటూ చెక్ పెట్టారు. కొందరు గిట్టని వారు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని.. నిజం కంటే అబద్ధం వేగంగా ప్రచారం చేస్తుందని ఓ ట్వీట్ కూడా చేశారు. మరోవైపు సింధియా వర్గం కూడా ఈ పుకార్లపై మండిపడుతోంది. సింధియా అంటే గిట్టని వారే ఇలాంటి ప్రచారానికి తెరలేపారని ఆరోపిస్తోంది.

మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్