రైల్వే స్టేషన్లను పేల్చేస్తాం: జైషే బెదిరింపు లేఖ

దేశంలో నరమేధం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సిద్ధమైంది. దసరా పండుగ రోజున ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడుతామని జైషే ఉగ్రవాదుల పేరిట రోహ్‌తక్ రైల్వే పోలీసులకు లేఖ రావడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమూహం ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని అందులో ఉగ్ర సంస్థ పేర్కొంది. అక్టోబర్‌ 8న హర్యానాలోని రోహతక్‌ రైల్వే స్టేషన్‌తో పాటు ముంబై సిటీ, […]

రైల్వే స్టేషన్లను పేల్చేస్తాం: జైషే బెదిరింపు లేఖ
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 11:00 AM

దేశంలో నరమేధం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సిద్ధమైంది. దసరా పండుగ రోజున ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడుతామని జైషే ఉగ్రవాదుల పేరిట రోహ్‌తక్ రైల్వే పోలీసులకు లేఖ రావడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమూహం ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని అందులో ఉగ్ర సంస్థ పేర్కొంది. అక్టోబర్‌ 8న హర్యానాలోని రోహతక్‌ రైల్వే స్టేషన్‌తో పాటు ముంబై సిటీ, బెంగళూరు, చెన్నై, జైపూర్‌, భోపాల్‌, కోటా, ఇటార్సీ రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని జైషే ఆ లేఖలో హెచ్చరించింది. అదే విధంగా రాజస్థాన్‌, జైపూర్‌, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానాలోని పలు ఆలయాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని పేర్కొంది.

కాగా ఈ లేఖ రైల్వే జంక్షన్ సూపరిటెండెంట్ కార్యాలయానికి శనివారం 3గంటల ప్రాంతంలో పోస్ట్ ద్వారా వచ్చింది. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి మసూద్‌ అహ్మద్‌ పేరిట వచ్చిన ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేవారు. లేఖలో పేర్కొన్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అయితే జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తరువాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన పలు ఉగ్రసంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్రానికి హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది కేంద్రం. మరోవైపు భారత నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై కూడా దాడి చేసేందుకు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారని సమాచారం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో