ఐపిఎల్ బెట్టింగ్‌ భూతానికి యువకుడి బలి.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

|

Nov 19, 2020 | 5:03 PM

క్రికెట్‌ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఐపిఎల్ బెట్టింగ్‌ భూతానికి యువకుడి బలి.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు
cricket betting
Follow us on

క్రికెట్‌ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. రుద్రూర్ గ్రామానికి చెందిన చరణ్ క్రికెట్ గేమ్ అంటే తెగ పిచ్చి. ఇటీవల ముగిసిన ఐపిఎల్ క్రికెట్ కు బాగా ఆకర్షితుడయ్యాడు. అంతేకాదు. మ్యాచ్ సంబంధించి బెట్టింగ్ కడుతున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో, స్నేహితుల నుంచి అప్పులు తీసుకువచ్చి మరీ బెట్టింగ్ కడుతున్నాడు. ఈ క్రమంలోనే లక్షా 50 వేలు అప్పు చేసి బెట్టింగ్ కాశాడు. అసలు డబ్బులకు తోడు వడ్డీ సైతం భారీగా పెరిగిపోవడంతో తట్టుకోలేక చరణ్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. చేతికందవచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ తల్లదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బెట్టింగ్ పెట్టొద్దని బతిమిలాడినా తమ కొడుకు వినలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.