శ్రేయాస్ అయ్యర్.. క్రికెటర్ మాత్రమే కాదు.. మెజీషియన్ కూడా!

Shreyas Iyer Magic Trick With Khaleel Ahmed, శ్రేయాస్ అయ్యర్.. క్రికెటర్ మాత్రమే కాదు.. మెజీషియన్ కూడా!

టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానాన్ని ఎలా భర్తీ చేయాలనీ తలపట్టుకున్న సమయంలో వెస్టిండీస్‌ సిరీస్‌తో శ్రేయాస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. నిలకడైన ఆటతీరుతో.. ఇచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకుంటూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా నాలుగో స్థానానికి కూడా శ్రేయాస్ చక్కగా సరిపోతాడని అటు కోచ్, ఇటు కెప్టెన్ కూడా పలు సందర్భాల్లో అయ్యర్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతన్న టీ20 సిరీస్‌లో కూడా అయ్యర్(16) కెప్టెన్ విరాట్ కోహ్లీ(72*)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య ఆదివారం జరగనున్న చివరి టీ20 మ్యాచ్ ఆసక్తిగా మారింది. మరోవైపు రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన అనంతరం ఆటగాళ్లందరికి తీరిక సమయం దొరకడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. ఆ తరుణంలో శ్రేయాస్ అయ్యర్ తనకు తెలిసిన మ్యాజిక్‌తో.. సహచర ఆటగాడు ఖలీల్ అహ్మద్‌కు ఓ ట్రిక్ చేసి ప్రదర్శించాడు. లేట్ ఎందుకు ఆ ట్రిక్ ఏంటో మీరు కూడా చూసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *