Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

అమ్మాయితో సహజీవనం తప్పా..?: అథ్లెట్ ద్యుతి చంద్

Dutee Chand, అమ్మాయితో సహజీవనం తప్పా..?: అథ్లెట్ ద్యుతి చంద్

ఓ టీనేజీ అమ్మాయితో తాను సహజీనం చేస్తున్నట్లు భారత మహిళా అథ్లెట్ ద్యుతి చంద్ ప్రకటించారు. వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపు పొందిన ద్యుతి.. స్వలింగ సహజీవనంపై బహిరంగంగా ప్రకటించిన తొలి భారత అథ్లెట్ కావడం విశేషం. అవును.. నేను 19ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె మా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకు సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్‌లోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడి ఉంటుంది. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఎప్పటిలాగే నా కెరీర్‌ను కొనసాగిస్తా అని 23ఏళ్ల ద్యుతి వెల్లడించింది.

ఇక తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని కూడా బెదిరించిందని వెల్లడించింది. అయితే మేజర్ అయిన తాను స్వతంత్రంగా ఉండాలని భావించానని.. అందుకే బహిరంగంగా సహజీవనంపై మాట్లాడుతున్నానని ద్యుతి తెలిపింది.

అయితే ఇప్పుడు కూడా తమ బంధాన్ని బయటపెట్టడానికి మరో కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. గతంలో పింకీ ప్రమాణిక్ అనే మహిళా అథ్లెట్ తన సహచర అథ్లెట్‌ను బలత్కారం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అందుకే అన్ని ఆలోచించాకే, భాగస్వామితో చర్చించాకే తమ బంధాన్ని బయటపెడుతున్నానని పేర్కొంది. అందులోనూ సుప్రీం తీర్పు కూడా తమకు ధైర్యాన్నిచ్చిందని తెలిపింది.

కాగా ఆమె కెరీర్‌లోనూ సవాళ్లను ఎదుర్కొంది. ఆమె శరీరంలో పురుష హర్మోన్లు ఉన్నట్లు తేలడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ద్యుతిపై నిషేధం విధించింది. దీన్ని ఆమె ఆర్బిట్రేషన్ కోర్టులో సవాల్ చేసి విజయం సాధించి మళ్లీ ట్రాక్‌లో అడుగెట్టింది. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చిన సుప్రీం.. పెళ్లికి మాత్రం ఇంకా చట్టబద్ధత ఇవ్వలేదు.

Related Tags