కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులకు సాయం.. బహ్రెయిన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత్

కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పట్ల బహ్రెయిన్ దేశం చూపిన ప్రత్యేక శ్రద్ధకు భారతదేశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులకు సాయం.. బహ్రెయిన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత్
Follow us

|

Updated on: Nov 25, 2020 | 4:29 PM

కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పట్ల బహ్రెయిన్ దేశం చూపిన ప్రత్యేక శ్రద్ధకు భారతదేశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. బహ్రెయిన్‌ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖమంత్రి అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ విస్తరిస్తున్న సమయంలో భారతీయులకు ఉచిత వైద్యం అందిచడంతో పాటు.. స్వదేశాయానికి తిరిగి పంపడంలోనూ ఆ దేశం చూపిన చొరవకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారం తదితర విషయాలపై చర్చలు జరిగినట్లు మంత్రి తెలిపారు. అలాగే, నవంబర్ 11న మరణించిన బహ్రెయిన్ ప్రధాని షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మృతికి జయశంకర్ సంతాపం ప్రకటించారు. భారతీయుల తరఫున బహ్రెయిన్ ప్రజలు, అధికారులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ బహ్రెయిన్‌తో పాటు యూఏఈ, సీషెల్స్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఇక బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ డేటా ప్రకారం ఆ దేశం మొత్తం జనాభా 14 లక్షల్లో సుమారు 3.50 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.