ఉద్యోగులపై ‘యోగి’ కొరడా.. 201మందికి పింక్ స్లిప్‌లు

పనితీరు సరిగా లేని మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొరడా ఝులిపించనున్నారు. ఈ నేపథ్యంలో 29 విభాగాలకు చెంది 201మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు మరో 417 మంది ఉద్యోగులను సస్పెండ్ లేదా తొలగించే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. వారిలో క్లాస్ 1 అధికారులు ఉన్నట్లు సమాచారం. పనితీరు, అవినీతి కారణంగానే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. […]

ఉద్యోగులపై ‘యోగి’ కొరడా.. 201మందికి పింక్ స్లిప్‌లు
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 7:55 AM

పనితీరు సరిగా లేని మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొరడా ఝులిపించనున్నారు. ఈ నేపథ్యంలో 29 విభాగాలకు చెంది 201మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు మరో 417 మంది ఉద్యోగులను సస్పెండ్ లేదా తొలగించే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. వారిలో క్లాస్ 1 అధికారులు ఉన్నట్లు సమాచారం. పనితీరు, అవినీతి కారణంగానే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జాబితాలో రాష్ట్ర విద్యుత్ విభాగం ఉద్యోగులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారట.

కాగా అద్భుత పనితీరు చూపిన వారికి రివార్డులు ఇస్తామని బుధవారం జల్ నిగమ్‌లో జరిగిన సమావేశంలో యోగి స్పష్టం చేశారు. అలాగే పనితీరు సరిగా లేని వారిని ఇంటికి పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించని వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.